సొంతగూటికి రాజగోపాల్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్

komatireddy rajagopal reddy rejoin in congress,komatireddy rajagopal reddy,rajagopal reddy rejoin in congress,komatireddy rejoin in congress,Mango News,Mango News Telugu,congress, bjp, komatireddy rajagopal reddy, telangana politics, telangana assembly elections,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News,Telangana Latest News And Updates, Telangana Political News And Updates,Hyderabad News,komatireddy Latest News,komatireddy Latest Updates
congress, bjp, komatireddy rajagopal reddy, telangana politics, telangana assembly elections

తెలంగాణలో జంపింగ్ జపాంగ్ రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఎన్నికలవేళ నేతలు పార్టీలు మారుతూ హోరెత్తిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తులంతా ఇతర పార్టీల్లోకి జంపవుతున్నారు. కొందరు నేతలు మొన్నటి వరకు ఆ పార్టీపై విమర్శలు చేసి.. ఇప్పుడు మళ్లీ అదే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అటు టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన అధిష్టానానికి రివర్స్ షాక్ ఇచ్చారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

పోయినసారి ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొద్దిరోజులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో రాజగోపాల్ రెడ్డి కొద్దిరోజులు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా అమిత్ షా‌తో సమావేశమై.. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి కాషాయపు కండువా కప్పుకున్నారు.

దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో మాత్రం రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలయ్యారు. రాజగోపాల్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో బీజేపీ మంచి ఫామ్‌లో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కుతుందని.. తిరిగి    అసెంబ్లీలో అడుగుపెడుతానని రాజగోపాల్ రెడ్డి భావించారు. కానీ ఆ తర్వాత నుంచి బీజేపీ డౌన్ ఫాల్ ప్రారంభయింది. అనూహ్యంగా బీజేపీ వెనుకబడిపోయింది.

అదే సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఒక్కసారిగా ఆ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్‌కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి రాజగోపాల్ రెడ్డి మనసు మారింది. అనవసరంగా పార్టీ మారానని అనుకుంటున్నారు. అయితే కొద్దిరోజులుగా రాజగోపాల్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ దీనిపై స్పందించలేదు. అలాగే బీజేపీ నుంచి మునుగోడు టికెట్ తన భార్యకు.. ఎల్బీ నగర్ టికెట్‌ తనకు రాజగోపాల్ రెడ్డి ఆశించారు.

కానీ బీజేపీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకూ.. అతని భార్యకు ఇధ్దరికీ టికెట్ ఇవ్వలేదు. అప్పటికే అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. టికెట్ దక్కకపోవడంతో మరింత అసంతృప్తికి లోనయ్యారు. ఈ మేరకు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. బుధవారం బీజేపీ పార్టీకి.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఉదయం 11.12 గంటలకు ఆ పార్టీలో చేరనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − nine =