పార్లమెంట్ ఎన్నిక‌ల బాధ్యతలు కేటీఆర్‌ భుజానా..

KTR Bhujana Is In Charge Of The Parliament Elections, Charge Of The Parliament Elections, KTR Charge Of The Parliament Elections, KTR Bhujana Parliament Elections, KTR, BRS, Lok Sabha Elections, Telangana, Latest BRS Parliament Elections, BRS Parliament Elections News, BRS News, Lok Sabha News, Poltical News, Mango News, Mango News Telugu
KTR, BRS, Lok sabha elections, Telangana

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం భారతీయ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని లోక్‌సభ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అధినేత కేసీఆర్‌ శస్త్రచికిత్స కారణంగా ఇంటికే పరిమితం కావడంతో బాధ్యత మొత్తం ఆయన తనయుడు, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు (కేటీఆర్‌)పై పడింది. దాన్ని సవాల్‌గా తీసుకున్న కేటీఆర్‌ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. నేతలు, కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఓటమికి గల కారణాలపై చర్చిస్తూనే.. లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహాలను వెల్లడిస్తున్నారు.

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పర్యవేక్షణ బాధ్యతలను కేటీఆర్‌ ఇప్పటికే ఎమ్మెల్సీలకు అప్పగించారు. పార్టీ అభ్యర్థులు ఓటమి చెందిన చోట ప్రొటోకాల్‌ రీత్యా.. వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు పాల్గొనేందుకు వీలుండే అవకాశం ఉండడంతో  వ్యూహాత్మ‌కంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని, ఇప్పటికే ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. త్వరలో అధినేత కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని వారిలో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందే గ్రామ స్థాయి నుంచి పొలిట్‌ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించే దిశగా అడుగులు వేస్తున్నారు. చురుకైన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారిని ఉత్సాహపరిచే విధంగా కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత క్రియాశీలం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నెలకొనే త్రిముఖ పోటీలో బీఆర్‌ఎస్‌కే గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయంటూ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. ఎవరూ పార్టీని వీడి వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దిశా నిర్ధేశం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కేటీఆర్‌ నేడు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో జరగనున్న సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు,  ఎలా ముందుకు సాగాలనేది చర్చించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =