ఏపీ రణరంగం నుంచి పొరుగు రాష్ట్రాలకు..

Lokesh And Pawan Sacrifice For BJP,Pawan Lokesh Campaign For BJP In Karnataka,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Nara Lokesh,TDP,BJP,BJP News,Pawan Kalyan,Nara Lokesh Latest News,Pawan Kalyan Latest News,Lokesh And Pawan Steps In For BJP,Lokesh Campaigns For BJP In Coimbatore,Pawan Kalyan Election Campaign In Karnataka

ఎన్నికల వేళ ప్రచారం అన్నిటికంటే చాలా ముఖ్యం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజల మధ్యే తిరగడం, ఉండడం మరింత ముఖ్యం. ఐదేళ్లు ఎలా ఉన్నదానికంటే చివరి నెల రోజులు ఎలా ఉన్నామన్నదానిపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది విశ్లేషకులు మాట. అయితే లోకేశ్‌-పవన్‌ ఆలోచన మాత్రం ప్రస్తుతం టీడీపీ, జనసేన కార్యకర్తలను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి, జనసేనకు డూ ఆర్ డైలా మారిన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోరు ముదురుతోంది. సరిగ్గా ఈ సమయంలో రెండు పార్టీల ముఖ్య నేతలు తమ రణస్థలాలను వదిలి బీజేపీ తరపున ప్రచారం చేయాలని ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు.

అటు లోకేశ్‌.. ఇటు పవన్:

రెండు రోజులుగా, కోయంబత్తూరు లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థి అన్నామలై తరపున టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం, తమిళనాడు తర్వాత, బెంగళూరు (సిటీ) లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య కోసం ప్రచారం చేయడానికి లోకేశ్‌ బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందట.

నిరాశలో కార్యకర్తలు:

అదే సమయంలో పవన్‌ కూడా పొరుగు రాష్ట్రాల బాట పట్టనున్నారని తెలుస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో తన సొంత గడ్డపై గట్టిపోటీని ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్, కర్ణాటకలో బీజేపీకి మద్దతు ఇవ్వడానికి తన ప్రచార తేదీలను కేటాయించారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర అభ్యర్థన మేరకు, పవర్ స్టార్ ఏప్రిల్ 17 నుంచి రోడ్ షోల్లో పాల్గొననున్నారు. తెలుగు మాట్లాడే చిక్కబళ్లాపూర్, కోలార్, బళ్లారి, రాయచూర్‌లలో ప్రచారం చేయాలని భావిస్తున్నారు. లోకేశ్‌, పవన్లు తమ తమ నియోజకవర్గాలపై దృష్టి సారించి పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తెస్తే బాగుంటుందని కార్యకర్తలు భావించారు. అయితే కీలక సమయంలో ఈ ఇద్దరు తీసుకున్న నిర్ణయం సపోర్టర్స్‌కు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నిర్ణయం పార్టీ క్యాడర్‌ను నిరుత్సాహపరిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =