ఏపీపై తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఎలాంటి దురుద్దేశం లేదని వెల్లడి

Minister KTR Gives Clarity on His Comments Regarding Situations in Andhra Pradesh, KTR Gives Clarity on His Comments Regarding Situations in Andhra Pradesh, Minister KTR Gives Clarity on His Comments Regarding Situations in AP, Minister KTR Gives Clarity on His Comments On AP, Comments On AP, KTR Gives Clarity on AP, AP Ministers furious with KTR dig on AP Development, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

ఏపీపై తాను చేసిన వ్యాఖ్యల వెనుక​ ఎలాంటి దురుద్ధేశం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలు మరియు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు‌ స్పష్టం చేశారు. నిన్న హైద‌రాబాద్‌లో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) ప్రోపర్టీ ఎక్స్‌పోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. తెలంగాణకు వచ్చే పెట్టుబడిదారులకు తెలంగాణ లోని అభివృద్ధిని గురించి వివరిస్తూ ఏపీ లోని ప్రస్తుత పరిస్థితులపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఏపీకి చెందిన పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు కేటీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఆంధ్రా ప్రజలు సంతోషంగా ఉన్నారని, మంత్రి కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి కేటీఆర్‌ ట్వీట్టర్ లో తన స్పందనని తెలియజేశారు. ‘ఈ రోజు ఒక సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు బాధ కలిగించినట్టుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గారిని నేను సోదరుడిగా భావిస్తాను. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా మంత్రి కేటీఆర్ నిన్నటి సమావేశంలో మాట్లాడుతూ.. మా దగ్గరకి వచ్చే పెట్టుబడిదారులను ముందు ఇతర ప్రాంతాలు చూసి రమ్మని చెప్తున్నా.. మీరు అక్కడి మౌలిక పరిస్థితులు, స్థానిక ఇబ్బందులను చూసి, తిరిగి హైదరాబాద్‌కు రండి, అప్పుడు ఇతర నగరాల కంటే హైదరాబాద్ బెటరని మేరే స్వయంగా చెప్తారు అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 7 =