గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం, వరుసగా 7వ సారి అధికారంలోకి…

Gujarat Assembly Elections-2022 BJP Wins 156 Seats Retains Power for a Record 7th Time,Gujarat Assembly Elections Phase-1,Gujarat Assembly Elections Voting,Gujarat Assembly Polls,Gujarat Assembly,PM Modi Road Show in Ahmedabad,Gujarat Assembly Elections,Congress Chief Mallikarjun Kharge,Mango News,Mango News Telugu,Prime Minister Narendra Modi, Narendra Modi News and Updates,PM Modi Latest News and Updates,PM Modi,Prime Minister Modi,Indian Prime Minister Modi Latest News and Updates, Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Gujarat Assembly News And Live Updates,Gujarat Exit Poll Results,Himachal Pradesh Exit Poll Results

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు 92 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా, బీజేపీ 156 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ ఏకపత్య ఘనవిజయంతో గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడవసారి అధికారం చేపట్టనుంది. కాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 17 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 5 స్థానాల్లో, సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానంలో, ఇండిపెండెంట్స్ 3 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రంలో వరుసగా ఏడవసారి కూడా బీజేపీ ప్రభంజనం సృష్టించడంతో ఆ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. అలాగే గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. 1985లో కాంగ్రెస్‌ పార్టీ 149 స్థానాల్లో విజయం సాధించగా, తాజా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాలను గెలుచుకుని రికార్డు నెలకొల్పింది.

కాగా డిసెంబర్ 12వ తేదీన కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఈ కార్యక్రమం గాంధీనగర్ లో జరుగుతుందని గుజరాత్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ప్రకటించారు. బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. సీఆర్ పాటిల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్‌, రుషికేశ్ పటేల్‌, హర్ష్ సంఘ్వి, కనుభాయ్ దేశాయ్, మనీషా బెన్ వకీల్, హార్దిక్ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఘనవిజయం సాధించారు. అలాగే జామ్‌నగర్ నార్త్ స్థానంలో క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి, బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా గెలుపొందారు. ఇక ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గధ్వీ, ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా పరాజయం పాలయ్యారు.

గుజరాత్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, “ధన్యవాదాలు గుజరాత్. అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి నేను చాలా భావోద్వేగాలకు లోనయ్యాను. ప్రజలు అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదించారని, అదే సమయంలో ఈ ఊపు మరింతగా కొనసాగాలని కోరుకుంటున్నారని ఆకాంక్షించారు. నేను గుజరాత్ జనశక్తికి నమస్కరిస్తున్నాను.కష్టపడి పనిచేసిన గుజరాత్ బీజేపీ కార్యకర్తలు అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీలో ప్రతి ఒక్కరు ఛాంపియన్. మన పార్టీకి నిజమైన బలం అయిన మన కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు” అని పేర్కొన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (182): (గెలుపు)

  1. బీజేపీ: 156
  2. కాంగ్రెస్: 17
  3. ఆప్ : 5
  4. సమాజ్ వాదీ పార్టీ: 1
  5. ఇండిపెండెంట్స్: 3.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =