మునుగోడులో సీఎం కేసీఆర్‌ సభతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది – మంత్రి హరీష్ రావు

Munugode By-poll Minister Harish Rao Says TRS Win Confirms with CM KCR Yesterday's Public Meeting, Minister Harish Rao Says TRS Win, Mango News, Mango News Telugu, TRS Minister Jagadish Reddy, TRS Party Victory in Munugode By-Poll, TRS Party Victory, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడులో సీఎం కేసీఆర్‌ సభతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద్రాభంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆదివారం టీఆర్ఎస్ నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిందని, దీని ద్వారా సీఎం కేసీఆర్‌పై ఉన్న ప్రజాభిమానం వెల్లడైందని అన్నారు. మునుగోడులో దశాబ్దాలుగా ఉన్న ఫ్లోరైడ్‌ సమస్యకు ముఖ్యమంత్రి శాశ్వత పరిష్కారం చూపించారని, టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సభతో బీజేపీ నాయకులకు నిద్ర కరువైందని, దీంతో ఎన్నికల్లో గెలవడానికి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఇక కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. వారిద్దరూ ముందు తమస్థాయి తెలుసుకుని సీఎం కేసీఆర్‌ను విమర్శించాలని, వారి స్థాయి ఏంటో ఢిల్లీ నుంచి వచ్చిన దూతలే చెప్పారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచిన ఘనత బీజేపీదేనని విమర్శించారు. వందల కోట్లతో ప్రలోభపెట్టి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని, అయితే వారి ఎత్తుగడలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురూ తిప్పికొట్టారని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ప్రజామోదంతో ఏర్పాటైన ప్రభుత్వాలను కూలగొట్టడమే బీజేపీ నైజమని, కానీ, తెలంగాణలో వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 5 =