మే 14 వరకు తెలంగాణలో 14 కేంద్రాల్లో పాస్‌ పోర్టు సేవలు నిలిపివేస్తూ నిర్ణయం

Covid-19 impact, COVID-19 Situation, Mango News, Passport Services, Passport Services Closed, Passport services halt, Passport Services Halted, Passport Services Halted in 14 Centres, Passport Services Halted in 14 Centres In Telangana, Passport Services Halted in 14 Centres In Telangana Due to Covid-19 Situation, Passport Services Stopped, Passport Seva, Passport Seva Services

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు కేంద్రాల్లో పాస్‌పోర్టు సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 14 తపాలా కార్యాలయాల ద్వారా అందిస్తున్న పాస్‌ పోర్టు సేవలను ఏప్రిల్ 29, గురువారం నుంచి మే 14 వరకు నిలిపివేస్తున్నట్టుగా సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ప్రకటించారు. దీంతో మేడ్చల్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి వంటి తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి.

సేవలు నిలిపివేత నేపథ్యంలో దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు. కాగా ఈ కేంద్రాల్లో తిరిగి సేవలు ఎప్పుడూ ప్రారంభించాలనేది తపాలా శాఖ అధికారులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని కీలక పాస్‌ పోర్టు సేవా కేంద్రాలైన బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలీచౌకీ, నిజామాబాద్‌, కరీంనగర్‌ వంటి కేంద్రాల్లో పాస్‌ పోర్టు సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =