తెలంగాణ హోంశాఖ కార్యదర్శిగా రవిగుప్తా నియామకం

Mango News Telugu, Political Updates 2019, Ravi Gupta Appointed As Home Secretary, Ravi Gupta appointed as Telangana home department secretary, Ravi Gupta Appointed As Telangana Home Secretary, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖలో రెండు ప్రధాన పదవులకు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (టెక్నాలజీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి గుప్తాను హోంశాఖ కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా జైళ్ల శాఖ నూతన డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేదిని నియమించారు. జైళ్ల శాఖలో ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న సందీప్ షాండిల్య స్థానంలో రాజీవ్ త్రివేది బాధ్యతలు స్వీకరించనున్నారు.

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో, మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనబోతుండడంతో హోం శాఖలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మునిసిపాలిటీలపై వివిధ అంశాలపై కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 70 కేసులు కూడ వీగిపోతాయని అంచనాకు రావడంతో, త్వరలో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కాబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడ మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు సమాయత్తమవుతుంది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − nine =