రేపటినుండి ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో.. శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు

Sri Ramanujacharyas 1006th Birth Anniversary Celebrations To be Held From Tomorrow at Muchintal Ashram,Sri Ramanujacharyas 1006th Birth Anniversary Celebrations,1006th Birth Anniversary Celebrations To be Held From Tomorrow,Birth Anniversary at Muchintal Ashram,Mango News,Mango News Telugu,Sri Ramanujacharya Jayanti 2023,Sri Ramanujacharyas Latest News,Sri Ramanujacharyas Latest Updates,Muchintal Ashram Latest News,Muchintal Ashram Live updates,Sri Ramanujacharyas Anniversary News Today

హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్యుల 1006వ సాప్తహ్నిక జయంతి వేడుకలు మంగళవారం నుండి ఘనంగా జరుగనున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సమానమేనని వేయి సంవత్సరాల క్రితమే ఎలుగెత్తి చాటిన ఆ మహానుభావుడి జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని, ఆయన ఆశీస్సులు పొంది సమాజ సేవలో భాగస్వాములవ్వాలని చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. ఇక రేపటినుండి ప్రారంభమవుతున్న ఈ వేడుకలు మే 1వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆశ్రమంలో పలు పూజా క్రతువులు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు చినజీయర్ స్వామి వెల్లడించారు. శ్రీ రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని 25వ తేది ఉదయం 7:30 నుండి సువర్ణ రామానుజుల తిరుమంజన సేవతో వేడుకలు ప్రారంభం అవనున్నాయి.

శ్రీ రామానుజాచార్యుల 1006వ సాప్తహ్నిక జయంతి సందర్భంగా సమతామూర్తి స్పూర్తి కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమాలు..

  • 25-04-2023 – విద్యార్థి వందిత రామానుజ!
  • 26-04-2023 – బాలసేవిత రామానుజ! .
  • 27-04-2023 – బహుజన కామిత రామానుజ!
  • 28-04-2023 – మహిళా మాన్యద రామానుజ!
  • 29-04-2023 – విద్వత్ వినుత రామానుజ!
  • 30-04-2023 – విశ్వరూపధర రామానుజ!
  • 01-05-2023 – కవిజన కలిత రామానుజ!

కాగా గతేడాది శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో గతేడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఫిబ్రవరి 5న ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన పంచలోహ శ్రీరామానుజాచార్య విరాట్ (సమతామూర్తి) విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అలాగే ఫిబ్రవరి 13న సమతామూర్తి కేంద్రంలోని మొదటి అంతస్తులోని భద్రవేదిలో 120 కేజీల శ్రీ రామానుజాచార్యుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 8 =