ఆ మూడు స్థానాల్లో టి.కాంగ్రెస్ లైన్ క్లియర్..

T Congress line is clear in those three seats,T Congress line is clear,clear in those three seats,War of words between Asaduddin Owaisi,Cliffhanger in Telangana,Congress sets its poll line,Parties draw battle line in south,Mango News,Mango News Telugu,Congress Cadre Stands Missing,Bypoll Results 2023 Highlights,T Congress Latest News,T Congress Latest Updates,T Congress Live News,Asaduddin Owaisi Live Updates
Rebels, T. Congress, Telangana Assembly Elections 2023,TRS, Congress, Bjp,

ఎన్నికలు వచ్చిన ప్రతీసారి విజయం సాధించడం కోసం చేసే ప్రయత్నాలు కంటే..  సొంత పార్టీలోని అసంతృప్తులను, రెబల్స్‌ను బుజ్జగించడం లోనే పార్టీ పెద్దలు ఎక్కువ సమయం తీసుకుంటారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ప్రతీ ఎన్నికలలోనూ ఇదే సీన్ కనిపించినట్లే ఈ ఎన్నికలలోనూ ఈ సీన్ కనిపిస్తోంది. దీంతో ప్రచారాలు కాసేపు పక్కన పెట్టి.. రెబల్స్‌ను బుజ్జగించే పనిలోనే కాన్సన్‌ట్రేట్  చేస్తున్నారు నేతలు. తాజాగా టీ కాంగ్రెస్ లో మూడు నియోజకవర్గాలలో రెబల్స్ నిలబడటంతో..కాంగ్రెస్ బుజ్జగింపుల పర్వాన్ని సక్సెస్ ఫుల్‌గా  కంప్లీట్ చేశారు పార్టీ పెద్దలు.

దీంతో డోర్నకల్, సిరిసిల్లా, నర్సాపూర్ నియోజకవర్గాలకు లైన్ క్లియర్ అయినట్లు అయింది. ఆయా అభ్యర్థులతో కలసి పని చేస్తామని ఆస్పిరెంట్లు పార్టీకి హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో  మంగళవారం ఏఐసీసీ ఇన్ చార్జీ థాక్రే సమక్షంలో ఈ బుజ్జగింపులు జరిగాయి. పది నియోజకవర్గాలకు చెందిన రెబల్స్‌తో థాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్‌ చర్చలు జరిపారు.కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని..పవర్ కోసం పని చేయాలని కోరారు.

దీంతో..డోర్నకల్ నియోజకవర్గంలో నెహ్రు నాయక్‌తో కలసి పనిచేస్తామని అక్కడి ఆశావహులు పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు.అలాగే కేకే మహేందర్ రెడ్డితో కలిసి పని చేస్తానని సిరిసిల్ల అసంతృప్త నేత ఉమేష్ రావ్, నర్సాపూర్‌లో గాలి అనిల్ కుమార్‌లు వారికి హామీ ఇచ్చారు. దీనికి తగినట్లుగానే ఇప్పటికే గాలి అనిల్ తన నామినేషన్‌ను విత్ డ్రా కూడా చేసుకున్నారు. అయితే సూర్యాపేట్, ఆదిలాబాద్ సెగ్మెంట్‌లలో మాత్రం రెబల్స్‌ను బుజ్జగించడంలో థాక్రే, మహేష్ కుమార్ గౌడ్ సఫలం కాలేకపోయారు. మరోవైపు మిగిలిన  4  నియోజకవర్గాల్లోనూ ఆశావహులు తమ నిర్ణయాన్ని చెబుతామని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 4 =