దేశంలో ఖరీదైన ఎన్నికలుగా..తెలంగాణ ఎలక్షన్స్

As expensive elections in the country Telangana elections,As expensive elections in the country,Telangana elections,expensive elections,Mango News,Mango News Telugu, in the country, Telangana elections ,Telangana Assembly Elections 2023,TRS, Congress, Bjp,Telangana Polls,Telangana Assembly elections,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
expensive elections, in the country, Telangana elections ,Telangana Assembly Elections 2023,TRS, Congress, Bjp,

గెలవడమే ముఖ్యం ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు అన్నట్లుగా సాగుతోంది తెలంగాణ  ఎన్నికలలోని నేతల వ్యవహారం. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో బీఆర్ఎస్ నేతలు ఉండగా.. గులాబీ పార్టీపై జనాల్లో పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న తమ పార్టీని స్ట్రాంగ్ చేసి తమదీ బలమైన పార్టీనే అని చెప్పడానికి బీజేపీ పావులు కదుపుతోంది.  దీంతో నేతలంతా ఎంత ఖర్చుకు అయినా వెనుకాడటం లేదు. ఈ శాసనసభ  ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ  చేస్తున్న మొత్తం ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లు చేరే అవకాశం ఉన్నట్లు  చర్చ జరుగుతోంది.

సభలు, సమావేశాలు, ర్యాలీలతో పాటు.. కార్యకర్తల అవసరాలకు పెట్టే ఖర్చు ఒక ఎత్తు అయితే పోల్ మేనేజ్‌మెంట్ కోసం చేసే ఖర్చు మరో ఎత్తు అవుతుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్శించడానికి  ఓ ప్రధాన పార్టీలన్నీ భారీ ఎత్తున ఖర్చు చేయడానికి రెడీ అయ్యాయన్న టాక్ వినిపిస్తుంది. మెయిన్‌గా  ఓ పార్టీ.. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఓటర్‌కు మందు, మటన్, చికెన్‌తో పాటు నగదును పంపిణీ చేయడానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖరీదైన ఎన్నికలుగా తెలంగాణ ప్లేస్ కన్ఫమ్ చేసేసిందన్న వార్తలు జోరందుకున్నాయి.

మరోవైపు ఎన్నికల్లో ధన ప్రవాహం ఓ రేంజ్‌లో ఉంటుందని వార్తలు జోరందుకోవడంతో  కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. నగదును అడ్డుకునేందుకు ఇప్పటికే  బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. ఎప్పటికప్పుడు పర్సనల్ అకౌంట్లపై నిఘా వేసి, ఎక్కువ మొత్తంలో నగదు విత్ డ్రా చేసినట్లు గుర్తిస్తే.. వెంటనే ఆ వ్యక్తులను పిలిచి విచారిస్తున్నారు. అయితే, ఈసీ ఎంతగా నిఘా పెట్టినా.. ఓటర్లకు పంచే నగదు ఇప్పటికే గ్రామాలకు చేరిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు రాక ముందే ఓ ప్రధాన పార్టీ తనకు బాగా నమ్మకస్తులైన కార్యకర్తల ఇళ్లకు డబ్బును చేరవేసినట్లుగా తెలుస్తోంది.

ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో తమకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకుండా.. ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 112 నియోజకవర్గాలలో  ఏకంగా రూ.5 వేల కోట్లను అభ్యర్థుల చేతికే అప్పగించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సగటును ఒక్కో నియోజకవర్గంపై రూ.50 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు అక్కడ ప్రత్యర్థి పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటే ఇంకో  రూ.20 కోట్లను ఖర్చు చేయడానికి కూడా అభ్యర్థులు రెడీ అయిపోయారట. రెండేళ్ల క్రితం హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలలో ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంచినట్లు అప్పట్లో గట్టిగానే వార్తలు వినిపించాయి. మరి ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు ఏ  రేంజ్‌లో ఖర్చు పెడతారో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =