తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24: శాఖల వారీగా కేటాయింపులు ఇవే…

Telangana Annual Budget 2023-24 Department Wise Budget Allocation List,Welfare and Development in the State Budget 2023-24,Telangana Govt To Present Budget,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Mango News,Mango News Telugu,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget,Telangana State Annual Budget 2023-24 Live Updates

తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు ఈరోజు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రిగా మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల‌ అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్య‌యం రూ.2,11,685 కోట్లుగా, క్యాపిటల్ వ్య‌యం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో వ్య‌వ‌సాయం, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, నీటిపారుద‌ల‌, రోడ్లు మరియు భవనాలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, విద్యా, వైద్య శాఖలకు అత్య‌ధికంగా నిధులు కేటాయింపు చేశారు.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24: శాఖల వారీగా కేటాయింపులు (మొత్తం రూ.2,90,396 కోట్లు)

  1. వ్యవసాయం అండ్ సహకార శాఖ – రూ.26,831 కోట్లు
  2. పశు సంవర్ధక అండ్ మత్స్య శాఖ – రూ.2,071 కోట్లు
  3. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ – రూ.6,229 కోట్లు
  4. ఇంధన శాఖ – రూ.12,727 కోట్లు
  5. పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ – రూ.1,471 కోట్లు
  6. ఆర్థిక శాఖ – రూ.49,749 కోట్లు
  7. ఆహారం అండ్ పౌర సరఫరాల శాఖ – రూ.3,117 కోట్లు
  8. సాధారణ పరిపాలన శాఖ – రూ.1,491 కోట్లు
  9. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ – రూ.12,161 కోట్లు
  10. ఉన్నత విద్యా శాఖ – రూ.3,001 కోట్లు
  11. హోం శాఖ – రూ.9,599 కోట్లు
  12. పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ – రూ.4,037 కోట్లు
  13. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ – రూ.366 కోట్లు
  14. నీటిపారుదల శాఖ – రూ.26,885 కోట్లు
  15. కార్మిక మరియు ఉపాధి శాఖ – రూ.542 కోట్లు
  16. న్యాయ శాఖ – రూ.1,665 కోట్లు
  17. శాసన సభ (లెజిస్లేచర్) – రూ.168 కోట్లు
  18. మైనారిటీ సంక్షేమ శాఖ – రూ.2,200 కోట్లు
  19. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ – రూ.11,372 కోట్లు
  20. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.31,426 కోట్లు
  21. ప్రణాళికా శాఖ – రూ.11,495 కోట్లు
  22. రెవెన్యూ శాఖ – రూ.3,560 కోట్లు
  23. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ – రూ.21,022 కోట్లు
  24. సెకండరీ ఎడ్యుకేషన్, సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్ – రూ.16,092 కోట్లు
  25. రవాణా శాఖ – రూ.1,644 కోట్లు
  26. రోడ్లు మరియు భవనాల శాఖ – రూ.22,260 కోట్లు
  27. గిరిజన సంక్షేమ శాఖ – రూ.3,965 కోట్లు
  28. మహిళలు, పిల్లలు, వికలాంగులు అండ్ సీనియర్ సిటిజన్లు – రూ.2,131 కోట్లు
  29. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం మరియు కల్చర్ శాఖ – రూ.1,117 కోట్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 9 =