ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

MLAs Poaching Case Telangana High Court Gives Green Signal To CBI For The Investigation,Telangana HC,Upholds Lower Court Order,Telangana MLAs Poaching Case,Mango News,Mango News Telugu,BRS MLAs Poaching Case,Minister KTR Asks Several Questions,Union Minister Kishan Reddy,BRS MLAs Poaching Case,Telangana Sit,Sit Investigation Mla Poaching Case,Trs Mla Poaching Case,Telangana Mla Poaching Case,Telangana Mla Poaching Case Latest News And Updates,Telangana Mla Poaching ,Telangana Bjp,Telangana Cm Kcr,Trs Party,Brs Party,Ysrtp,Brs Party Latest News And Updates

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను సమర్ధించిన డివిజన్ బెంజ్, ఈ కేసును సీబీఐ దర్యాప్తును కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాగా గతంలో సీబీఐతో విచారణకు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా.. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనితో పాటు కేసులో భాగమైన తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా మరో పిటీషన్‌ వేశారు. ఈరోజు ఈ పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వీటిని కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది.

అయితే హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొంత వ్యవధి కావాలని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దాదాపు 15 రోజుల పాటు ఈ తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయాలని సీజే ధర్మాసనాన్ని కోరగా, ఉన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. కాగా గతంలో ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం జనవరి 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి సమ్మతిస్తూ నేడు హైకోర్టు తీర్పు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 20 =