వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay Visits Vemulawada Sri Raja Rajeswara Swami Temple, Bandi Sanjay Visits Vemulawada Sri Raja Rajeswara Swami Temple,Telangana BJP Chief Bandi Sanjay ,Vemulawada Sri Raja Rajeswara Swami Temple, Bandi Sanjay Visits Vemulawada,BJP Chief Bandi Sanjay Visits Vemulawada,Telangana BJP Chief ,Telangana ,Telangana News,Mango News

ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఎంపీ సంజయ్‌కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం బండి సంజయ్ మీడియానుద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తానని చెప్పారు.. కానీ ఇప్పటివరకు ప్రజలకు ఊహ చిత్రాలు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా.. ఎంపీ సంజయ్ అక్కడి భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం తెలంగాణ ప్రజానీకం ఆనవాయితీ అని తెలిపారు బండి సంజయ్. కానీ, భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం సమీక్ష చేయక పోవడం బాధాకరమని బండి సంజయ్‌ అన్నారు. క్యూలైన్‌లో పసి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆలయంలో శానిటేషన్ విఫలమైందని పరిశుభ్రత లేదన్నారు. తెలంగాణ వచ్చాక ఇన్‌చార్జ్‌ ఈఓలే ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయంపై.. పేద భక్తులపై.. ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here