జీహెఛ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం, కాసేపట్లో నోటిఫికేషన్?

GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Notification, GHMC Elections Notification To Released Today, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News Telugu, Telangana Municipal Elections, Telangana SEC Parthasaradhi

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌(ఎస్‌ఈసీ) పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ ను ఎస్‌ఈసీ విడుదల చేయనున్నట్టు సమాచారం. డిసెంబర్‌ 1 వ తేదీన పోలింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరికాసేపట్లో అధికారికంగా నోటిఫికేషన్ వివరాలు తెలియనున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇప్పటికే సమాయత్తమయింది. ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధమైంది. తుది జాబితా ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 74,04,286 మంది ఓటర్లున్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల జాబితా కూడా నవంబర్ 21వ తేదీకి సిద్దమవనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =