రేపు యూపీలో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

Telangana CM KCR will Attend the Last Rites of Late Mulayam Singh Yadav at Uttar Pradesh Tomorrow, CM KCR To Attend Last Rites of Late Mulayam Singh Yadav, Last Rites of Late Mulayam Singh Yadav, Mulayam Singh Yadav Demise, Mango News, Mango News Telugu, Samajwadi Party Founder Mulayam Singh Yadav, Mango News, Mango News Telugu, Mulayam Singh Yadav Passes Away, Samajwadi Party Founder, Samajwadi Party, Mulayam Singh Yadav Dies, Mulayam Singh Yadav Dead, Mulayam Singh Yadav Passes Away, Samajwadi Party Founder Passes Away, Mulayam Singh Yadav Passes Away at 82, Telangana CM KCR

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (అక్టోబర్ 11, మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర ప్రదేశ్, ఇటావా జిల్లాలోని ములాయం సింగ్ స్వగ్రామం సైఫయ్ కు వెళ్ళి, ములాయం పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన చేసింది.

మరోవైపు ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ కు, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్య్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి మూడుసార్లు సీఎంగా, కేంద్రమంత్రిగా జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం పని చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 14 =