కాంగ్రెస్ సర్కార్‌లో మంత్రులు వీళ్లే..?

These are the Ministers in the Congress Government,These are the Ministers,Ministers in the Congress Government,Congress Ministers,Revanth reddy, batti vikramarka, congress, uttam kumar reddy, seetakka,Mango News,Mango News Telugu,Congress high command,Telangana Assembly election,Congress Government Latest News,Congress Government Latest Updates,Congress Government Live News,Minister Batti Vikramarka Latest News,Uttam kumar reddy Latest Updates,Congress Ministers Latest News,Congress Ministers Latest Updates
Revanth reddy, batti vikramarka, congress, uttam kumar reddy, seetakka

ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురుతోంది. అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అయితే ఫలితాలు వెలువడి రెండు రోజులు అవుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు సీఎం అభ్యర్థి ఎవరు అనేది తేలలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఓవైపు కసరత్తు జరుగుతోంది. సోమవారమే రాజ్‌భవన్‌లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలొచ్చాయి. కానీ చివరి నిమిషంలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా సీఎం కుర్చీ కావాలని పట్టుపట్టుకొని కూర్చున్నారు.

సీఎం అభ్యర్థి వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో అధిష్టానం ఏఐసీసీ అబ్జర్వర్‌ను ఢిల్లీకి పిలిచింది. డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లిన కాసేపటికి అటు భట్టి విక్రమార్క,  ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. చివరికి అధిష్టానం సీఎంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసింది.  అలాగే మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న దానిపై  అధిష్టానం ఓ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి వర్గంలో అన్ని వర్గాల వారు ఉండేలా జాబితాను రూపొందించారట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డిప్యూటీ సీఎం పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కు స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అలాగే మంత్రి వర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డిలకు.. ఎస్టీ వర్గానికి చెందిన సీతక్కకు.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ బాబుకు.. వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు, ప్రేమ్ సాగర్ రావులకు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వినోద్‌కు… బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖకు.. మైనార్టీ వర్గానికి చెందిన ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీలకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే  ఈనెల 7న కొత్త ముఖ్యమంత్రితో పాటు.. వీరంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =