తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

Coronavirus, Coronavirus Latest News, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 11, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 33,402 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 11,062 శాంపిల్స్ పరీక్షించగా 9884 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 736, రంగారెడ్డిలో 125, మేడ్చల్ లో 101, రాజన్న సిరిసిల్లలో 24, కరీంనగర్ లో 24, వరంగల్ అర్బన్ లో 20, మెదక్ లో 16, సంగారెడ్డిలో 13, మహబూబ్ నగర్ లో 12, పెద్దపల్లిలో 12, నల్గొండలో 12, నిజామాబాద్ లో 12, యాదాద్రి లో 9, వికారాబాద్ లో 9, సిద్ధిపేట లో 9 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 11, సాయంత్రం 5 గంటల వరకు) :

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 33,402
కొత్తగా నమోదైన కేసులు (జూలై 10 – జూలై 11 (5PM-5PM) : 1178
నమోదైన మరణాలు : 9
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 20,919
యాక్టీవ్ కేసులు : 12,135
మొత్తం మరణాల సంఖ్య : 348

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + two =