బంగ్లాదేశ్ లో ఏప్రిల్ 5 నుంచి ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధింపు

7-day lockdown, 7-day lockdown In Bangladesh, Bangladesh, Bangladesh 7-day Countrywide Lockdown, Bangladesh Announced 7-day Countrywide Lockdown, Bangladesh announces countrywide lockdown, Bangladesh Govt, Bangladesh Govt Announced 7-day Countrywide Lockdown, Bangladesh Govt Announced 7-day Countrywide Lockdown from April 5, Bangladesh imposes 7-day countrywide lockdown f, COVID-19 Update, Mango News

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. వరుస వేవ్ లతో కరోనా మళ్ళీ వణికిస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్, డెన్మార్క్, బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజాగా భారత్ పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ లో కూడా పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించారు. కరోనా కొత్త వేవ్ తో నమోదవుతున్న పాజిటివ్ కేసులను నియంత్రించడానికి ఏప్రిల్ 5 నుండి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

అత్యవసరసేవలను మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయించినట్టు చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో కోర్టులు సహా ప్రతి కార్యాలయం మూసివేయబడతాయని, అయితే పరిశ్రమలు మరియు మిల్లుల కార్యకలాపాలను కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్ లో ఇప్పటివరకు 6,24,594 కరోనా కేసులు నమోదవగా, 5,47,411 మంది కోలుకున్నారు. ఇక కరోనా వలన 9,155 మంది మరణించగా, ప్రస్తుతం ఆ దేశంలో 68,028 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 2 =