తెలంగాణలో కొత్తగా 1280 కరోనా కేసులు, 2261 రికవరీలు నమోదు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1280 కేసులు నమోదవడంతో జూన్ 13, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,03,369 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 15 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3484 కి పెరిగింది.

ఇక గత 24 గంటల్లో 2261 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 5,78,748 కు చేరుకుంది. ప్రస్తుతం 21,137 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాడు 91,621 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,67,23,910 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 4,49,325 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − ten =