కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్

Telangana CS Santhi Kumari held Teleconference with Collectors on Kanti Velugu Program Today, CS Santhi Kumari held Teleconference with Collectors on Kanti Velugu Program Today, Telangana CS Santhi Kumari held Teleconference with Collectors, Teleconference on Kanti Velugu Program Today, Telangana CS Santhi Kumari, Teleconference with Collectors, Telangana Kanti Velugu Program, Kanti Velugu Program News, Kanti Velugu Program Latest News And Updates, Kanti Velugu Program Live Updates, Mango News, Mango News Telugu

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సాయంత్రం జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమీషనర్ శ్వేతా మహంతి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డా.సత్యనారాయణలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ, ఈనెల 18వ తేదీన సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 2018లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కన్నా ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా తెలంగాణ రికార్డును తెలంగాణనే బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని కలెక్టర్లను ప్రోత్సహించారు. ఇప్పటికే 15 లక్షలకు పైగా కళ్ళద్దాలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. కంటి వెలుగు పై ప్రతి ఇంటికి, ప్రతీ ఒక్కరికీ తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలను అందించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eighteen =