ఖైరతాబాద్‌ మహా గణపతికి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళిసై, దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు

Telangana Governor Tamilisai Soundararajan Offers First Puja To Khairatabad Maha Ganapati, Governor Tamilisai Offers First Puja To Khairatabad Maha Ganapati, Khairatabad Ganesh 2022 First Pooja, Governor Tamilisai Offers Khairatabad First Pooja, Mango News, Mango News Telugu, Khairatabad Ganesh 2022 First Pooja, Governor Tamilisai Soundararajan, Khairatabad Ganesh, Ganesh Chaturthi, Tamilisai Soundararajan Latest News And Updates

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ చేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేందర్ గవర్నర్ తమిళిసైకి గణేశుడి చిత్రపటం బహూకరించి, సత్కరించారు.

మరోవైపు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కాగా ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాగణపతి దర్శనానికై భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష మండపం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గణేష్ మండపం వద్ద మూడు షిఫ్ట్‌ల్లో 360 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మండపం ఎదురుగా ఉన్న నాలుగు ప్రధాన రహదారులలో సీసీటీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే క్రైమ్‌ టీమ్స్‌, షీటీమ్స్‌, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, షాడో టీమ్స్ బృందాలతో బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =