తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, కొత్త రెవెన్యూ బిల్లుతో పాటుగా పలు బిల్లులకు ఆమోదం

abolition of VROs Bill, New Revenue Bill, Telangana Cabinet approves abolition of VROs Bill, Telangana Cabinet approves GST amendment, Telangana Cabinet Approves New Revenue Bill, Telangana cabinet clears Revenue Bill, Telangana Cabinet Decisions, Telangana Cabinet Key Decisions, Telangana State Cabinet, Telangana State Cabinet Approves New Revenue Bill

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు, బిల్లులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన రెవెన్యూ బిల్లుతో పాటుగా రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు మంత్రివర్గం‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లులను, ఆర్డినెన్సులను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు ఇవే:

  • ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని మంత్రి వర్గం ఆమోదించింది.
  • ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్-2020 ని ఆమోదించింది.

• తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు-2019లోని సవరణ బిల్లును ఆమోదించింది.

• పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్-గ్రామ పంచాయత్స్-ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు-2018 సవరణ బిల్లును ఆమోదించింది.

• తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు-2017 లో సవరణ బిల్లును ఆమోదించింది.

• తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020ని ఆమోదించింది.

• ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020 ను కేబినెట్ ఆమోదించింది.

• ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్-2002ని ఆమోదించింది.

• ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది.

• టిఎస్-బిపాస్ బిల్ ను ఆమోదించింది.

• తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు-1956 సవరణ బిల్లును ఆమోదించింది.

• ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు-1972కు సవరణ బిల్లును ఆమోదించింది.

• కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది.

• కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

• 17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =