స‌మ‌యం లేదు మిత్ర‌మా..!

There is only two weeks time for elections,There is only two weeks time,Two Weeks Time For Election,Electoral Bonds,Telangana Assembly Elections, Telangana Politics, brs, congress, bjp,Mango News,Mango News Telugu,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News,Time for elections Latest News,Telangana Politics, Telangana Political News And Updates
telangana assembly elections, telangana politics, brs, congress, bjp

ఈ నెల 30న తెలంగాణ ఎన్నిక‌ల పోలింగ్‌. 28వ తేదీ వరకు మాత్రమే అభ్య‌ర్థుల ప్ర‌చారానిక గ‌డువు.  అంటే రెండు వారాల సమయం కూడా లేదు. ఇప్ప‌టికే ఎన్నికల రంగంలో ముఖ్య ఘట్టాలైన నామినేషన్లు, ఉపసంహరణలు ముగిశాయి. రెబెల్స్‌కు బుజ్జగింపులు, హామీలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది పబ్లిసిటీ. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం. ఈ కార్యక్రమాలకు అన్ని పార్టీలూ రంగం సిద్ధం చేసుకున్నాయి. స‌మ‌యం త‌క్కువే ఉండ‌డంతో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఎదుటి వారికంటే తామే అంతటా కనిపించేలా, ప్రజల మనస్సులో చెరగని ముద్రవేసేలా ప్రచారాలకు సిద్ధమవుతున్నారు.

గతంలో కంటే భిన్నంగా ఈసారి ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు తమదైన స్టైల్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు.  ఎక్కువమంది సోషల్‌మీడియానే నమ్ముకున్నారు. దీంతో కంటెంట్‌ రైటర్స్‌కూ, సింగర్స్‌కూ డిమాండ్‌ పెరిగింది. పెరిగిన టెక్నాలజీతో ఎవరికి  వారుగా యూట్యూట్‌చానెళ్లు క్రియేట్‌ చేసుకుంటున్నారు. వాట్సప్‌ గ్రూపులకైతే లెక్కేలేదు. ఎక్స్‌(ట్విట్టర్‌)లు, ఇన్‌స్టాగ్రామ్‌లు,ఫేస్‌ బుక్‌లు సరేసరి. టెలికాలర్లు, ఎఫ్‌ఎంల నుంచి టీవీల దాకా దేన్నీ వదలకుండా అన్ని మాధ్యమాలనూ వినియోగించుకుంటున్నారు. ఓవైపు ఎన్నికల వ్యయం చూపించేందుకు చిక్కకూడదు.. మరోవైపు ప్రచారం మాత్రంమోతెక్కిపోవాలి. ఇందుకు ఎవరికి వారుగా తమ తెలివితేటల్ని ప్రదర్శిస్తూ  ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించారు.

ప్రచారపర్వంలో అభ్యర్థుల విన్యాసాలకు, వేషధారణలకు అంతూపొంతూ ఉండదు. ప్రజలకు వీలైనంత వినోదం పంచుతారు. ఒకరు సెలూన్‌లో పిల్లలకు  క్షవరం చేస్తారు. ఒకరు రోడ్డుపక్క బండిపై  దోసెలు వేస్తారు. ఒకరు మటన్‌ దుకాణంలో వర్కర్‌గా మారతారు. ఇంకొకరు కూరగాయలు అమ్ముతారు. దారిలో ఏ పని కనపడితే ఆ పని చేస్తారు. తమకు వచ్చినా రాకున్నా ఆ పనిచేస్తూ ఆ వృత్తిలోని వారికి తగిన గౌరవమిస్తారు. మొత్తానికి ఎన్ని పనులున్నాయో.. ఎంత కష్టమో తెలుసుకుంటారు. ఓట్ల కోసమే కావచ్చు. కనీసం ఆయా వృత్తుల గురించి తెలుస్తుంది. ఇక ప్రధాన పార్టీల రోడ్‌షోలు, పార్టీల్లోని స్టార్‌ కాంపైనర్ల ప్రచారాలు సరేసరి.

పీఎం, సీఎంలూ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మొత్తానికి ప్రజలకు సరికొత్త వాతావరణం ప్రత్యక్షం కానుంది. బరిలో మిగిలిన 2290 మందీ తమ గెలుపు కోసం ప్రచారం చేసుకుంటారు. గెలుపుపై నమ్మకం ఉన్నవారితో పాటు గెలవమని తెలిసిన వారూ ప్రచారంచేస్తారు. వీలైనంత మందిని ఆకట్టుకొని పోలైనన్ని ఓట్లు పొందాలని చూస్తారు. మొత్తానికి ప్రచార పర్వం ఎన్నికల సంగ్రామంలో ప్రత్యేకత కలిగిన అధ్యాయం. ఉన్న స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ‌గా జ‌నాల్లోకి వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకున్నారు. ఇందుకోసం ఎవ‌రికి వారు ప్ర‌త్యేక టీమ్ ల‌ను  సైతం సిద్ధం చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + two =