తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు

TRS MLAs Purchasing Case Telangana High Court Rejects For Remand to Three Accused,High Court Verdict In Telangana MLA's Purchase Case,Telangana MLA's Purchase Case, TRS MLAs Purchase Case, BJP Demands MLAs Purchase Case To CBI , Mango News, Mango News Telugu, Allegations on TRS MLAs Purchasing Issue,Telangana BJP Chief Bandi Sanjay,Allegations on TRS MLAs Purchasing, TRS MLAs Purchasing Issue, TRS MLAs Purchasing Issue Amid Munugode By-poll, TRS MLAs Purchasing Issue, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna BJP Party,

తెలంగాణలో వెలుగుచూసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుకి సంబంధించి శనివారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. అయితే వాదనల సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఏసీబీ ప్రోసీజర్ ఫాలో కాలేదని, పీసీ యాక్ట్ పెట్టినప్పుడు ఏసీబీ రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలని సూచించింది. ఇక లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ నిందితులను రిమాండ్ చేసే అర్హత లేదని, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్‌లో ఏసీబీ మాత్రమే అరెస్ట్ చూపాలని కూడా పేర్కొంది.

అయితే నిందితులు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించినట్లు తమవద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అలాగే ఈ కేసులో ముగ్గురు నిందితులు సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజిలను సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్ట్ ఆదేశించింది. కాగా అంతకుముందు ఏసీబీ కోర్ట్ పోలీసుల తీరుని తప్పు పడుతూ అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను విడుదల చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేయగా, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ వేసిన పిటిషన్‌పై శనివారం హైకోర్టు విచారణ జరుపనుంది. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం లేదని పేర్కొంటూ కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని తెలంగాణ బీజేపీ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =