తెలంగాణ ఎంసెట్-2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలు

EAMCET, TS Eamcet, TS Eamcet 2020 Counselling, TS Eamcet 2020 Counselling Revised Schedule, TS EAMCET Counselling, TS EAMCET Counselling 2020, TS Eamcet Counselling 2020 Revised Schedule, TS Eamcet Counselling Revised Schedule, TS Eamcet Counselling Revised Schedule 2020, TSEAMCET

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ ఎంసెట్-2020 కౌన్సెలింగ్ కు సంబంధిన షెడ్యూల్ కూడా ప్రకటించారు. కాగా వెబ్ ఆప్షన్స్ పక్రియ వాయిదా పడింది. వెబ్‌ ఆప్షన్లు అక్టోబర్ 12, సోమవారం నుంచే మొదలవ్వాల్సి ఉండగా, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్త కోర్సులకు సంబంధించిన సీట్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉండడం, అలాగే యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తికాని నేపథ్యంలో వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు సవరించిన ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రం ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం నుంచి జరగనుంది. ఇక వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ అక్టోబర్ 18వ తేదీ నుంచి 22 వరకు చేపట్టాలని విద్యార్థులకు సూచించారు.

టీఎస్‌ ఎంసెట్-2020 ప్రవేశాల సవరించిన షెడ్యూల్:

తొలివిడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 19 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 19 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 22 వరకు
  • ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – అక్టోబర్ 22
  • మొదటి విడత సీట్లు కేటాయింపు – అక్టోబర్ 24
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 28 వరకు

చివరి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – అక్టోబర్ 29
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – అక్టోబర్ 30
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – అక్టోబర్ 30, 31
  • ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – అక్టోబర్ 31
  • చివరి విడత సీట్లు కేటాయింపు – నవంబర్ 2
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 2 నుంచి నవంబర్ 5 వరకు

–> స్పాట్ అడ్మిషన్స్: నవంబర్ 4

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 6 =