ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పై రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్

Azadi Ka Amrut, Azadi Ka Amrut Mahotsav, Azadi Ka Amrut Mahotsav Programme, Azadi Ka Amrut News, Azadi ka Amruth Mahotsav to involve public, Cabinet Secy reviews Azadi Ka Amrut Mahotsav, Mango News, Rajiv Gauba held VC with Chief Secretaries of States on Azadi Ka Amrut Mahotsav, Telangana Azadi Ka Amrut Mahotsav, Union Cabinet Secretary Rajiv Gauba, Union Cabinet Secretary Rajiv Gauba held VC with Chief Secretaries, Union Cabinet Secretary Rajiv Gauba held VC with Chief Secretaries of States on Azadi Ka Amrut Mahotsav

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కి సంబంధించి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వేడుకలలో ప్రజలను పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆయన ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. మార్చి 12, 2021న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రారంభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి తెలియజేశారు. హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరియు వరంగల్‌ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఎగురవేసినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా “భారీ ఫ్రీడం రన్” కూడా నిర్వహించబడిందని, ఇది కాకుండా కవి సమ్మేళనం మరియు ఫోటో ఎగ్జిబిషన్‌లు నిర్వహించబడ్డాయని చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని హైలైట్ చేయడం జరిగిందని, ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here