హిమాన్షుకు ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు

CM KCR grandson Himanshu, cm kcr grandson Himanshu Rao bags Diana award, CM KCR’s Grandson Himanshu Rao, CM KCR’s Grandson Himanshu Rao Received Diana Award, Diana Award, Himanshu Kalvakuntla, Himanshu Kalvakuntla receives prestigious Diana Award, Himanshu Rao Received Diana Award, KCR Grandson Himanshu Rao Received Diana Award, KCR’s Grandson Receives Diana Award, Mango News

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షురావుకు బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు దక్కింది. ఈ విషయాన్ని హిమాన్షు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడంపై నేను చేసిన ‘షోమా’ అనే ప్రాజెక్టుకు డయానా అవార్డును అందుకున్నానని చాలా ఆనందంతో ప్రకటిస్తున్నా. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. గంగాపూర్‌, యూసఫ్‌ఖాన్‌పల్లి ప్రజలకు, నా సలహాదారులకు మరియు ప్రాజెక్ట్ అంతటా నాకు మార్గనిర్దేశం చేసిన నా తాతకు నా ప్రత్యేక ధన్యవాదాలు” అని హిమాన్షు ట్వీట్ చేశారు.

మరోవైపు తన కుమారుడు హిమాన్షుకు డయానా అవార్డుతో అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా డయానా అవార్డు ద్వారా ఇతరుల జీవితాలను మెరుగుపర్చడానికి పనిచేసే యువకులను సత్కరిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును 9-25 సంవత్సరాల వయస్సు గల యువకులకు వారు చేసిన సామాజిక చర్య లేదా మానవీయ కృషికి గుర్తింపుగా అందిస్తున్నారు. దివంగత బ్రిటన్‌ యువరాణి డయానా పేరు మీద 1999 నుంచి ఈ అవార్డులు అందజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eleven =