తెలంగాణ ఇచ్చింది మేమే.. త్వరలో కాంగ్రెస్ డాక్యుమెంటరీ

We are the ones who gave Telangana Congress documentary coming soon,We are the ones who gave Telangana Congress,Telangana Congress documentary coming soon,Mango News,Mango News Telugu,telangana politics, telangana assembly elections, congress, brs, congress documentory,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Congress documentary Latest News,Telangana Congress documentary Latest Updates,BRS Latest News and Updates,Telangana Assembly Elections Live News
telangana politics, telangana assembly elections, congress, brs, congress documentory

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ అధికార, ప్రత్యర్థి పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు తమ గురించి పాజిటీవ్‌గా చెప్పుకుంటూనే.. మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్ముతున్నాయి. ముఖ్యంగా ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణను తామే ఇచ్చామనే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

అయితే ఇప్పటికే బీఆర్ఎస్ తప్పులను ఎండగడుతున్న కాంగ్రెస్.. ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. 2014లో తెలంగాణ వచ్చిన సమయంలో చోటుచేసుకున్న విషయాలను కళ్లకుకట్టినట్లు ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమయింది. ఇందుకోసం ఓ డాక్యుమెంటరీని కాంగ్రెస్ రూపొందిస్తోంది. తెలంగాణ ఇచ్చే సమయంలో.. కాంగ్రెస్‌కు ఎంత నష్టం జరిగింది?.. ఎన్ని ఆటు పోట్లు ఎదుర్కొన్నది?.. అయినప్పటికీ తెలంగాణ ఇచ్చేందుకు సోనియా గాంధీ ఎందుకు సిద్ధపడింది?..  అనే విషయాలతో పాటు.. గత పదేళ్లలో కాంగ్రెస్ పోరాటాలు.. ప్రతిపక్ష నేతలపై కేసులు వంటి విషయాలను క్లిస్టర్ క్లియర్‌గా వివరిస్తూ డాక్యుమెంటరీని రూపొందిస్తోంది.

ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ కోసం కాంగ్రెస్ ఓ అగ్ర దర్శకుడితో సంప్రదింపులు జరిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరో వారం రాజుల్లో షూటింగ్, ఎడిటింగ్ పూర్తి చేసి ఆ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారని వివరించాయి. ఈ డాక్యుమెంటరీని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్లేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు.

అయితే 2014 నుంచి కూడా తెలంగాణను తామే తీసుకొచ్చామని బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. ఇదే సెంటిమెంట్‌తో గత రెండు ఎలక్షన్స్‌లో విజయకేతనం ఎగురవేసింది. ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఆ సమయంలో కాంగ్రెస్‌ ఈ డాక్యుమెంటరీని రూపొందించడం బీఆర్ఎస్‌‌కు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డాక్యుమెంటరీ వస్తే.. ఇకపై తెలంగాణ తీసుకొచ్చింది తామేనని చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్‌కు ఉండకపోవచ్చని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =