చాలా క్రెడిట్ కార్డులు ఉన్నా ఒక్క కార్డునే వాడుతున్నారా?

Have multiple credit cards but only use one card,Have multiple credit cards,only use one card,Mango News,Mango News Telugu,Credit card,Credit Utilisation Ratio, CUR,Credit Score, Taking a credit card, multiple credit cards but only use one card,multiple credit cards Latest Updates,Taking a credit card Latest News,Credit Utilisation Ratio Latest Update,Have multiple credit cards News Today,one card Latest News and Updates
Credit card,Credit Utilisation Ratio, CUR,Credit Score, Taking a credit card, multiple credit cards but only use one card?

ఇప్పుడు చాలామంది దగ్గర బ్యాంకు డెబిట్ కార్డులతో సమానంగానే క్రెడిట్ కార్డులు కనిపిస్తున్నాయి. ఇంకొంత మంది దగ్గర  డెబిట్ కార్డుల కంటే కూడా ఎక్కువ క్రెడిట్‌ కార్డులుంటున్నాయి. అయితే, కొంతమంది ఎక్కువగా ఉన్నవాటిలో ఒకటి వాడుతూ..మిగిలినవి వాడకుండా  పక్కన పెడుతుంటారు. ఇంకొంతమంది అయితే మరీ అత్యవసరం తప్ప.. క్రెడిట్ కార్డు తీయనే తీయరు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో వాళ్లు కొన్ని ప్రయోజనాలను కోల్పోవాల్సి రావొచ్చని అంటున్నారు. క్రెడిట్‌ కార్డును వాడకపోతే ఆర్థిక పరిస్థితులను కంట్రోల్  చేస్తున్నట్లు అనుకుంటారు కానీ.. కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు.

 

నిజానికి మంచి క్రెడిట్‌ స్కోర్‌ ను మెయింటైన్‌ చేయాలని ఎవరు అనుకున్నా.. వాళ్లకు క్రెడిట్‌ కార్డుకు మించినది వేరేది ఉండదు. కార్డును అవసరమున్న చోట వాడుతూ.. టైమ్ టూ టైమ్  బిల్లు చెల్లిస్తూ పోతే క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. క్రెడిట్ స్కోర్‌  పెరగడం వల్ల బ్యాంకు రుణాలు ఈజీగా రావడం వంటి  ప్రయోజనాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి ఈఎంఐలు ఆలస్యంగా చెల్లించడం వల్ల  ఇతర కారణాలతో  క్రెడిట్‌ స్కోర్ బాగా‌ దెబ్బతింటుంది. అలాంటప్పుడు క్రెడిట్ స్కోరును పెంచుకోవడానికి క్రెడిట్‌ కార్డును వాడటమే పరిష్కారం అవుతుంది. అందుకే కార్డును తరచూ వాడుతూ టైముకు బిల్లును చెల్లించాలి. లేదంటే కార్డు వాడకుండా అలాగే పక్కన పెట్టేస్తే  క్రెడిట్‌ హిస్టరీని కూడా కోల్పోయినట్లే అవుతుంది.

 

క్రెడిట్‌ కార్డు  క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే..రుణ వినియోగ నిష్పత్తి 35 నుంచి  40 శాతం కంటే తక్కువ ఉంటే మంచిది. ఇంకా చెప్పాలంటే మన కార్డు లిమిట్ లక్ష రూపాయలు అనుకుంటే 30 వేలకు మించి వాడకపోవడం మంచిది. అలా కాకుండా కార్డు పరిమితిలో మీరు వాడుతున్న మొత్తాన్ని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో సూచిస్తుంది. ఇది 40 శాతం మించితే కార్డు వినియోగదారులు  అప్పులపై  ఎక్కువగా ఆధారపడుతున్నట్లు అన్నమాట. అందుకే కార్డును తరచూ వాడడం వల్ల కంపెనీలు కార్డు లిమిట్‌ను  పెంచుతాయి. దీంతో కార్డు నుంచి ఎక్కువ మొత్తంలో వాడుకునే అవకాశం ఉంటుంది.కానీ  కార్డును పూర్తిగా పక్కన పెడితే.. పెరుగుతున్న  అవసరాలకు తగ్గట్లు ఎక్కువ మొత్తంలో కార్డును వాడుకునే వీలుండదు. దీనివల్ల కార్డు ప్రయోజనాలను  పూర్తిస్థాయిలో పొందలేరు.

 

కొన్ని కొన్ని కంపెనీలు..తమ  క్రెడిట్‌ కార్డును ఎక్కువ కాలం వాడకుండా పక్కన పెడితే..వాటిని డియాక్టివేట్‌ చేసేస్తాయి. అంతేకాదు వాటిపై ఛార్జీలు కూడా విధిస్తాయి. తిరిగి ఆ కార్డును పునరుద్ధరించుకోవడానికి మళ్లీ డబ్బులు కట్టాల్సి రావొచ్చు. అన్ని కంపెనీలు అలా చేయవు కాబట్టి కార్డు తీసుకునే ముందే ఈ  నియమ నిబంధనలన్నింటినీ తెలుసుకోవాలి. ఒక్కోసారి క్రెడిట్‌ కార్డులపై రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ వంటి ఆఫర్లు ఉంటాయి. అవకాశం ఉన్నప్పుడు కార్డును ఇలా వాడకపోతే వీటన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది. పైగా కార్డుపై చెల్లించే ఇయర్లీ ఫీజు వేస్ట్  అవుతుంది.

 

కొన్నిసార్లు అత్యవసరమైనప్పుడే వాడదాం అనుకొనే సమయానికి  ఆ కార్డు డియాక్టివేట్‌ అయిపోవచ్చు. అప్పుడు దాన్ని తిరిగి యాక్టివేట్‌ చేసుకోవడం చాలా టైమ్ వేస్ట్ పని అవుతుంది. పైగా అత్యవసర సమయంలో కార్డును వాడకుండా ఉండిపోవాల్సి వస్తుంది.  క్రెడిట్‌ హిస్టరీ మంచిగా ఉంటే ఆర్థిక లావాదేవీలకు చాలా కీలకంగా మారుతుంది. లోన్లు, ఇతర క్రెడిట్‌ ఉత్పత్తులకు అప్లై చేసుకున్నప్పుడు దీన్నే ఆ కంపెనీలు, బ్యాంకులు ఆధారం చేసుకుంటాయి. క్రెడిట్‌ కార్డు మీ లోన్ హిస్టరీలో  కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని బట్టే మీకు కొత్తగా ఇచ్చే లోనును మీరు తిరిగి చెల్లించగలరా లేదా అని బ్యాంకులు అంచనా వేస్తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 10 =