తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఎంత వరకూ కరెక్ట్?

Who Benefits From Free Bus Journey, Benefits From Free Bus Journey, Free Bus Journey Benefits, TSRTC Free Bus, Free Bus Journey Benefits, Telangana Government,Free Bus Journey, Latest Free BUS Journey News, Free BUS Journey Updates, Politcal News, Telangana Parliament Elections, Telangana, Mango News, Mango News Telugu
Tsrtc Free Bus, free bus journey benefits, Telangana government,Free Bus journey

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తోంది .  ఈ ఫ్రీ బస్సు సదుపాయం  ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ఉండగా.. లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ లాంటి బస్సుల్లో లేదు. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. అయితే కొంతమంది మాత్రం ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకం వలన నష్టాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ పెరిగిన పెట్రోల్, బస్సుల మెయింటెనెన్స్, సిబ్బంది జీతాలు వీటన్నింటి ఖర్చులు కలిపితే.. రోజూ  ఇప్పుడు ఆర్టీసీకి కావలసిన దానికంటే సుమారు  రూ. మూడు కోట్లు  తక్కువగా ఆదాయం వస్తుంది. నిజానికి మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వే నుంచి కూడా టీఎస్ ఆర్టీసీకి గట్టి పోటీ ఉంది. ఇటు ఇప్పటికే ఆర్టీసీ కష్టాలు తగ్గించుకోవడానికి  ఆర్టీసీ  కార్గో పార్సెల్ కూడా నడుపుతున్నా.. దానికి అనుకున్నంతగా స్పందన రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా  మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వల్ల సుమారుగా 50 శాతం ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది.

అయితే ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ కి ప్రతిరోజు 14 కోట్ల ఆదాయం వస్తుండగా.. వీటిలో ఫ్రీ స్కీమ్ వల్ల ఏడు కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వస్తుంది. అయితే ఈ పథకంలో మొత్తం భారాన్ని ప్రభుత్వం ఆర్టీసీ మీద వేయలేదు. ప్రతి నెల ఆర్టీసీలో ఎంతమంది మహిళలు బస్సు సదుపాయాన్ని వాడుకున్నారో  ఆ లెక్కలను ప్రభుత్వానికి  పంపిస్తే.. దానిని ప్రభుత్వం రీఇంబర్స్‌మెంట్ ద్వారా మహిళలు ప్రయాణం కోసం చెల్లించాల్సిన  డబ్బును ప్రభుత్వం ఆర్టీసీకి కడుతుంది.దీని వల్ల ఆర్టీసీకి లాభమే కానీ నష్టం జరగడం లేదు.

అంతేకాదు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం చిన్నపాటి ఉద్యోగం చేయడానికి అయినా, ఏదైనా ఉపాధి చూసుకోవడానికి అయినా కూడా  మహిళలు  ముందుకు వస్తారు. దీని వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే సొంత వాహనాలు వాడే మహిళలు కూడా ఫ్రీ  ఆర్టీసీ బస్సులు ఎక్కుతారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గడమ కాకుండా.. పెరుగుతున్న కాలుష్యాన్నికి చెక్ పెట్టినట్లు అవుతుంది.

అంతే కాకుండా ఉచిత బస్ ప్రయాణాల వల్ల దేవాలయాలు, పర్యాటకప్రదేశాలకు  సందర్శకులు పెరుగుతారు కాబట్టి.. దీని వల్ల అక్కడ  ఆదాయం కూడా పెరుగుతుంది. ఆలయాలు,  పర్యాటక ప్రాంతాల వంటివి అభివృద్ధి చెందుతాయి.ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల.. బస్టాండ్లో రద్దీ పెరుగుతుంది.దీని వల్ల అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్లు పెరుగుతారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 20 =