వైసీపీ-బీజేపీ పొత్తుపై సత్యకుమార్ క్లారిటీ

Satyakumar Clarity On YCP BJP Alliance, Satyakumar Clarity, Clarity On YCP BJP Alliance, YCP BJP Alliance, Satyakumar, YCP, CM Jagan, BJP, AP Assembly Elections, CM Jaga, Chandrababu Naidu, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YCP, CM Jagan, BJP, AP Assembly Elections

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏపీలో పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. అయితే బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో.. ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తు పొట్టుకొంటాయని అంతా భావించారు. కానీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది.

అయితే ముందు నుంచి ప్రధాని మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో ఏపీలో కొత్త చర్చ మొదలయింది. వైసీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి జగన్ ముందు నుంచి కూడా అనుకూలంగా ఉండడంతో.. ఈ రెండు పార్టీలు ఈసారి పొత్తు పెట్టుకోబోతున్నాయని చర్చ సాగుతోంది. ఈక్రమంలో బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే.. జనసేన, టీడీపీ ఆ పార్టీలని ఢీ కొట్టగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ ఊహాగానాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన సత్యకుమార్.. అటువంటి పార్టీలతో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని అన్నారు. ఏపీలో సంక్షేమం పేరుతో గాలి మాటలతో జగన్ పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు పనులకు మాత్రం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు.

వైసీపీ సర్కార్ ప్రజలతో ఫుట్ బాల్.. యువతతో క్రికెట్.. ఉద్యోగులతో కబడ్డీ ఆడుతోందని మండిపడ్డారు. వైసీపీ పాలకులు బయటకొస్తే.. ప్రజలు వారితో ఫుట్ బాల్ ఆడుకునేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే.. ఏపీ మరింత నాశనమయ్యేదని చెప్పుకొచ్చారు. ఇటువంటి అవినీతి పార్టీతో ఎట్టిపరిస్థితిలోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seven =