లోక్‌సభ ఎన్నికల ముంగిట.. టి.కాంగ్రెస్‌లో అనూహ్య మార్పులు

On The Eve Of The Lok Sabha Elections Unpredictable Changes In T Congress, Lok Sabha Elections Unpredictable Changes, T Congress Lok Sabha Elections Unpredictable Changes, Unpredictable Changes In T Congress, Manikrao Thakare, Deepa Das Munshi, Telangana Congress, Revanth Reddy Lok Sabha Elections Unpredictable, Lok Sabha Elections, T Congress, Politcal News, Telangana Parliament Elections, Telangana, Mango News, Mango News Telugu

తెలంగాణలో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటక ఫలితాలతో ఫామ్‌లోకి వచ్చిన పార్టీ.. చివరికి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఓవైపు రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తీవ్రంగా చమటోడ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ విజయతీరాలకు చేరడంలో మాణిక్ రావ్ ఠాక్రే కీలక పాత్ర పోషించారు. పార్టీ నేతలందరినీ సమన్వయం చేసి పార్టీని విజయం వైపు నడిపించారు. తన వ్యూహాలతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా మాణిక్ రావ్ ఠాక్రేనే.. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉంటారని అంతా అనుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలంటే.. ఆయనే ఇంఛార్జ్‌గా ఉండాలని పార్టీ నేతలు కూడా భావించారు. కానీ ఇక్కడే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

లోక్ సభ ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలే ఉండగా.. కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను ఆ స్థానం నుంచి తొలగించింది. ఠాక్రే స్థానంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా పశ్చిమ బెంగాల్ ఎంపీ దీపా దాస్ మున్షీని నియమించింది. అసెంబ్లీ ఎన్నికలవేళ దీపా దాస్ మున్షీ ఏఐసీసీ పరిశీలకురాలిగా పని చేశారు. 6 నెలల నుంచి దీపా దాస్ తెలంగాణలోనే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలను దగ్గరుండి పరిశీలించిన దీపా దాస్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యహారాలపై పట్టు సాధించారు.

అయితే పార్టీకోసం ఎంతో శ్రమించిన మాణిక్ రావు ఠాక్రేన్ హైకమాండ్ ఉన్నపలంగా తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల ముంగిట ఠాక్రేను తొలగించడం వెనుక హైకమాండ్ వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =