కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లోకి ఆ ఇద్దరు నేతలు

A shock to Congress Those two leaders joined BRS,A shock to Congress,Those two leaders joined BRS,Mango News,Mango News Telugu,Nagam Janardhan Reddy quits Congress,congress, brs, bjp, telangana assembly elections, telangana politics,Bjp Fails To Woo Cong,Brs Leaders Ahead Of Third List,Telangana Politics, Telangana Political News and Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
congress, brs, bjp, telangana assembly elections, telangana politics`

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు భగభగమంటున్నాయి. ఇళ్లు మారినంత సింపుల్‌గా నేతలు పార్టీలు మారుతూ.. రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. నిన్నవున్న వారు ఈరోజు ఆ పార్టీలో కనిపించడం లేదు. అధికార, ప్రత్యర్థి పార్టీలు కూడా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను హక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రాసెస్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ కాస్త ముందంజలో ఉంది. ఇప్పటికే ఇతర పార్టీలో నుంచి పలువురు దిగ్గజ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంది.

ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలవేళ దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఇద్దరు కీలక నేతలు, అదికూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆపార్టీకి గుడ్ బై చెప్పేశారు. టికెట్ నిరాకరించడంతో.. మరోక్షణం కూడా ఆలోచించకుండా ఈ పార్టీకి రాజీనామా చేసేశారు. ఇటీవల కాంగ్రెస్ మరో 45 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. అయితే రెండో జాబితాలో తమ పేరు కచ్చితంగా ఉంటుందని.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే జానారెడ్డి కుమారుడు, విష్ణువర్థన్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి ఆశించారు.

కానీ వారికి కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయి చూపించింది. టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.ఈక్రమంలో నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అటు విష్ణువర్థన్ రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే.. బీఆర్ఎస్‌ వారిని హక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏకంగా మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావులు నాగం జనార్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే అటు నాగం సైడ్ నుంచి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన కారు ఎక్కేందుకు రెడీ అయిపోతున్నారట.

ఇటు కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నారని తెలిసి.. విష్ణువర్థన్ రెడ్డికి గులాబీ బాస్ కబురు పెట్టారు. వెంటనే విష్ణువర్థన్ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో గులాబీ పార్టీలో చేరేందుకు విష్ణువర్ధన్ రెడ్డి రెడీ అయిపోతున్నారు. రేపో.. మాపో గులాబీ కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్నికలవేళ కీలక నేతలు జంప్ అవ్వకుండా అన్ని పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పైగా పలువురు కీలక నేతలను పక్కన పెడుతూ వస్తోంది. దీనివల్ల వారు వేరే దారును వెతుక్కుంటున్నారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =