కేంద్రం కీలక నిర్ణయం, దేశంలో వంటనూనె ధరలు తక్షణమే రూ.15 తగ్గించాలని కంపెనీలకు ఆదేశం

Centre Directs Edible Oil Associations to Reduce Prices by Rs 15, Centre Govt Directs Edible Oil Associations to Reduce Prices by Rs 15, Edible Oil Associations to Reduce Prices by Rs 15, Edible Oil Associations to Reduce Prices, Edible Oil Associations, Centre Govt, Cooking Oil to Become Cheaper by Rs 15/Litre, Centre directs edible oil firms to reduce prices by Rs 15/Litre, edible oil associations to reduce prices of edible oils by 15 rupees in the MRP with immediate effect, reduce prices of edible oils, edible oils, edible oil firms, Edible Oil price, Edible Oil price reduced News, Edible Oil price reduced Latest News, Edible Oil price reduced Latest Updates, Edible Oil price reduced Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వంట నూనె ధరలను తక్షణమే రూ.15 తగ్గించాలని ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లను కేంద్రం ఆదేశించింది. ధర తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు త్వరితగతిన అందించాలని కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సూచించింది. జులై 6న ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో ఎడిబుల్ ఆయిల్స్ ఎంఆర్పీలో తక్షణమే రూ.15 తగ్గేలా చూడాలని కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఆదేశాలు ఇచ్చింది. తయారీదారులు మరియు రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు కూడా వెంటనే ధర తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచించింది. తమ ధరలను తగ్గించని మరియు ఇతర బ్రాండ్‌ల కంటే వాటి ఎంఆర్పీ ఎక్కువగా ఉన్న కొన్ని కంపెనీలు కూడా వాటి ధరలను తగ్గించాలని సూచించారు.

అంతర్జాతీయంగా దిగుమతి చేసుకున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయని, ఇది ఎడిబుల్ ఆయిల్ అంశంలో చాలా సానుకూల విషయమని సమావేశంలో చర్చించారు. కాబట్టి దేశీయ మార్కెట్‌లో ధరలు కూడా తగ్గుముఖం పట్టేలా దేశీయ ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ నిర్ధారించుకోవాలన్నారు. ఈ ధర తగ్గుదల వెనుకబడిన పద్ధతిలో లేకుండా వినియోగదారులకు త్వరితగతిన అందజేయాలన్నారు. ధరల డేటా సేకరణ, ఎడిబుల్ ఆయిల్స్‌పై నియంత్రణ ఆర్డర్, ఎడిబుల్ ఆయిల్ ప్యాకేజింగ్ వంటి ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. దేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు మరియు లభ్యత పరిస్థితిని డిపార్ట్‌మెంట్ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఎడిబుల్ ఆయిల్స్ పై సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రయోజనం పొందడం అత్యవసరమని, అంతర్జాతీయ మార్కెట్‌లో నిరంతరంగా గణనీయంగా తగ్గుతున్న ధరలను తుది వినియోగదారులకు తక్షణమే అందజేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =