ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష, నేడు తాడిప‌త్రిలో వైఎస్ షర్మిల దీక్ష

Hunger Strike Of YS Sharmila, Hunger Strike Of YS Sharmila In Telangana, Mango News, Nirudyoga Nirahara Deeksha, Wanaparthy, YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha, YS Sharmila Hunger Strike, YS Sharmila Hunger Strike In Telanganan, YS Sharmila Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila, YSRTP Chief YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha at Tadipatri Village

ఇకపై రాష్ట్రంలో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను రూపుమాపేందుకు కృషిచేయడం కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి వారి కోసం పోరాడాల‌ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిర్ణ‌యించారు. ఈ నేపథ్యంలో నేడు (జూలై 13, మంగ‌ళ‌వారం) వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తాడిప‌త్రి గ్రామంలో ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిరుద్యోగుల స‌మ‌స్య‌ల సాధ‌నకై వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష‌ను చేప‌ట్ట‌నున్నారు. అలాగే నిరుద్యోగం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. ఈ నిరుద్యోగ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువ‌కులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌రై విజయవంతం చేయాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + sixteen =