తెలుగు స్వాతంత్య్ర సమరవీరులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం పాత్రలతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్‘ చిత్రం మరో ఘనత సాధించింది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం 46వ ‘జపాన్ అకాడమీ అవార్డు’ను గెలుచుకుంది. అత్యుత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇది అవార్డు సాధించింది. కాగా దీనికి ముందు మరే ఇతర భారతీయ చిత్రం కూడా ఇంతవరకు ఈ గుర్తింపు పొందలేదు. ఇటీవలే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అజయ్ దేవగన్, అలియాభట్ వంట బాలీవుడ్ తారలు ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంటోంది. గతేడాది నవంబర్లో జపాన్లో విడుదలైన ఏ సినిమా ఇప్పటికీ అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘అవతార్-2’, ‘టాప్ గన్: మావెరిక్’ వంటి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఘనత సాధించడం విశేషం. కాగా రాజమౌళి బృందం ఇప్పుడు ఆస్కార్ అవార్డుల కోసం సిద్ధమవుతోంది. ‘నాటు నాటు’ పాట కూడా నామినేట్ చేయబడి, ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ బరిలో నిలిచింది. ఒకవేళ ఈ అవార్డు కనుక సాధించగలిగితే ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టిస్తుంది. దీనితో పాటు మొత్తం 10 భారతీయ చిత్రాలు నామినేషన్ రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఆస్కార్ నామినేషన్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో సినీ అభిమానులు ఈ ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. ఇక రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టులో భాగంగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా తీయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE