అనకాపల్లి: అచ్చుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీ మూసివేత.. గ్యాస్ లీకేజి ఘటనలో చర్యలు

Anakapalle Brandix Seeds Unit in Atchutapuram SEZ Temporarily Closed For Gas Leakage Incident, Anakapalle Brandix Seeds Unit in Atchutapuram SEZ Temporarily Closed, Atchutapuram SEZ Temporarily Closed, Anakapalle Brandix Seeds Unit Temporarily Closed, Anakapalle Gas Leakage Incident, Gas Leakage Incident, Anakapalle Brandix Seeds Unit, Atchutapuram SEZ, Anakapalle, Seeds Unit of Anakapalle SEZ, Anakapalle SEZ, Anakapalle SEZ Gas Leakage Incident, Anakapalle Gas Leakage Incident, Anakapalle Gas Leakage Incident News, Anakapalle Gas Leakage Incident Latest News, Anakapalle Gas Leakage Incident Latest Updates, Anakapalle Gas Leakage Incident Live Updates, Mango News, Mango News Telugu,

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్‌ సీడ్స్‌ కంపెనీని తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అచ్యుతాపురం వద్ద గల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) వద్ద శుక్రవారం బ్రాండిక్స్ ఇండియా అపెరల్ రెండో యూనిట్ క్వాంటమ్ సీడ్స్‌ యూనిట్ లో అమోనియా గ్యాస్ లీక్ అయిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా యంత్రాంగం, అనకాపల్లి పోలీసులు మరియు కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎస్ఈజెడ్‌లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. గ్యాస్ ఎలా లీక్ అయింది అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.

అయితే ఈ ఘటనలో కంపెనీలో పనిచేస్తున్న 178 మంది మహిళా ఉద్యోగులు యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలు తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లలో మంట, కడుపులో వికారం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు మరికొందరు చుట్టుపక్కలవారు కూడా ఈ విషవాయువును పీల్చడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇలా మొత్తం 300 మంది వరకూ శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరందరికీ అనకాపల్లిలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో కొందరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 151 మంది మహిళా కార్మికులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో రెండో రోజు చికిత్స కొనసాగుతుంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు వైద్యులతో, అధికారులతో సమీక్ష చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eleven =