కోవిడ్-19 బూస్టర్ డోస్‌గా ‘కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌’ కు ఆమోదం తెలిపిన డీసీజీఐ

Covid-19 Biological E's Corbevax Gets Nod as First Heterologous Booster Dose, COVID-19 booster after two doses of Covishield or Covaxin, First Heterologous Booster Dose, Corbevax gets DCGI nod as COVID-19 booster after two doses of Covishield or Covaxin, Corbevax gets DCGI nod as COVID-19 booster, Biological E's Corbevax gets DCGI nod as a heterologous Covid booster dose, heterologous Covid booster dose, Covid booster dose, COVID-19, Biological E's corbevax, First Heterologous Covid booster dose, heterologous Covid-19 booster shot, Corbevax, Heterologous Covid booster dose News, Heterologous Covid booster dose Latest News, Heterologous Covid booster dose Latest Updates, Heterologous Covid booster dose Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్ ఇ లిమిటెడ్’ యొక్క ‘కార్బెవాక్స్’ వ్యాక్సిన్ భారత్ లోని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) చే ఆమోదించబడింది. దీంతో హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా ఆమోదించబడిన మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్‌గా నిలిచింది. భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ రెండు డోస్‌లు తీసుకోబడిన వ్యక్తులు ఇప్పుడు కార్బెవాక్స్‌ను బూస్టర్ షాట్‌గా తీసుకోవచ్చు.

దీనిపై ‘బయోలాజికల్ ఇ లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల మాట్లాడుతూ.. మా ఈ వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం తెలపడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది భారతదేశంలో కోవిడ్ -19 బూస్టర్ డోస్‌ల అవసరాన్ని పరిష్కరిస్తుంది. మా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రయాణంలో మేము మరో మైలురాయిని అధిగమించాము. ఈ విజయంతో కార్బెవాక్స్ యొక్క భద్రతా ప్రమాణాలు మరియు అధిక ఇమ్యునోజెనిసిటీని ప్రపంచ స్థాయిలో చాటడానికి గొప్ప అవకాశంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు. 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 416 మందిలో కంపెనీ క్లినికల్ ట్రయల్‌ని నిర్వహించిందని వెల్లడించారు.

భారత ప్రభుత్వం ఏప్రిల్ 10న ప్రైవేట్ టీకా కేంద్రాలలో పెద్దలందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ ముందు జాగ్రత్తగ బూస్టర్ డోస్‌లను ప్రారంభించింది. వీటిని మొదటగా ఫ్రంట్‌లైన్ వర్కర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు మరియు సీనియర్ సిటిజన్‌లకు అందించనున్నారు. బూస్టర్ డోస్‌లకు అర్హత పొందేందుకు పెద్దలకు రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలల సమయం ఉండాలని కేంద్రం నిబంధన పెట్టింది. అయితే, అనేక దేశాలు విధించిన షరతులకు అనుగుణంగా గత నెలలో విదేశాలకు వెళ్లే వారికి ఈ నిబంధనను సవరించారు. విదేశాలకు వెళ్లే వారు వారి రెండవ షాట్ తర్వాత మూడు నెలల తర్వాత వారి బూస్టర్ డోస్ తీసుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 13 =