ఏపీలో ఆగస్టు 3 నుంచి 12 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Andhra Pradesh Intermediate Public Advanced Supplementary Exams-2022 Schedule Released, Intermediate Public Advanced Supplementary Exams-2022 Schedule Released, Intermediate Public Advanced Supplementary Exams-2022, Intermediate Public Advanced Supplementary Exams, 2022 Intermediate Public Advanced Supplementary Exams, Intermediate Public Advanced Supplementary Exams Schedule Released, Andhra Pradesh Intermediate 1st And 2nd Year supplementary Exam Dates released, Andhra Pradesh Intermediate 2nd Year supplementary Exam Dates released, Andhra Pradesh Intermediate 1st Year supplementary Exam Dates released, supplementary Exam Dates released, Intermediate supplementary Exam Dates released, Intermediate supplementary Exam Schedule Dates released, Intermediate supplementary Exam, Intermediate supplementary Exam Dates released News, Intermediate supplementary Exam Dates released Latest News, Intermediate supplementary Exam Dates released Latest Updates, Intermediate supplementary Exam Dates released Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు-2022 షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ విద్యామండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. ఆగస్టు 3 నుంచి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

ప్రాక్టికల్‌ పరీక్షలను ఆగస్టు 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. మరోవైపు నైతికత, మానవ విలువలు పరీక్షను ఆగస్టు 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పర్యావరణ విద్య పరీక్షను ఆగస్టు 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • ఆగస్టు 3: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1
  • ఆగస్టు 4:: ఇంగ్లీష్ పేపర్-1
  • ఆగస్టు 5: మ్యాథమేటిక్స్ పేపర్- 1A, బోటనీ పేపర్- 1, సివిక్స్ పేపర్- 1,
  • ఆగస్టు 6: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
  • ఆగస్టు 8: ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
  • ఆగస్టు 10: కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, ఫైనర్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -1
  • ఆగస్టు 11: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు)
  • ఆగస్టు 12: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1 మరియు జాగ్రఫీ పేపర్ -1.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:

  • ఆగస్టు 3: సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 2
  • ఆగస్టు 4: ఇంగ్లీష్ పేపర్ -2
  • ఆగస్టు 5: మ్యాథమేటిక్స్ పేపర్- 2A, బోటనీ పేపర్- 2, సివిక్స్ పేపర్- 2
  • ఆగస్టు 6: మ్యాథమెటిక్స్ పేపర్- 2B, జువాలజీ పేపర్- 2, హిస్టరీ పేపర్- 2
  • ఆగస్టు 8: ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • ఆగస్టు 10: కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్ -2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ -2
  • ఆగస్టు 11: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
  • ఆగస్టు 12: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =