ఏపీలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలను ఖరారు చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Finalized Dates for Govt Programmes and Welfare Schemes of March April Months,CM Jagan finalize implementation dates,Jagan implementation government programs,implementation of government schemes,implementation of schemes March,implementation of schemes April in AP,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan Mohan Reddy,CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh CM YS Jagana Mohan Reddy,AP CM YS Jagan Latest News and Updates,AP CM YS Jagan Live Updates,AP CM YS Jagan News and Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాల అమలు తేదీలను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు సహా మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే పథకాలపై అధికారులతో చర్చించి తేదీల ఖరారు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోవడంతో, ఆయా కార్యక్రమాలను ఎప్పుడు అమలు చేయాలో చర్చించి సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు:

  • మార్చి 10 నుంచి జగనన్నగోరుముద్ద/మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం.
  • మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణ, బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు.
  • మార్చి 18 న జగనన్న విద్యాదీవెన, లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ.
  • మార్చి 22న ఉగాదిరోజున రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గ్రామా, వార్డు వాలంటీర్ల పేర్ల ప్రకటన.
  • మార్చి 23న రాష్ట్రవ్యాప్తంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
  • మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 5 వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహణ.
  • మార్చి 31న జగనన్న వసతి దీవెన కార్యక్రమం, నిధులు విడుదల.
  • ఏప్రిల్‌ 6వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు ప్రారంభం.
  • ఏప్రిల్‌ 10వ తేదీన గ్రామా, వార్డు వాలంటీర్లకు సన్మానం, అవార్డులు అందజేత.
  • ఏప్రిల్‌ 18వ తేదీన ఈబీసీ నేస్తం నిధులు విడుదల.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 10 =