ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన సీఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy Condoles Minister Goutham Reddy Demise, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, AP CM YS Jagan Condoles Minister Goutham Reddy Demise, Minister Goutham Reddy Demise, Minister Mekapati Goutham Reddy, Minister Mekapati Goutham Reddy Demise, Andhra minister Goutham Reddy passes away at 50, Andhra Minister Mekapati Gautham Reddy, Andhra Pradesh IT Minister Mekapati Goutham, Andhra Pradesh minister Mekapati Goutham Reddy, Andhra Pradesh minister Mekapati Goutham Reddy dies, AP Breaking News, AP Breaking News Today, AP Industries Minister Mekapati Gautham Reddy succumbs, AP IT Minister Mekapati Goutham Reddy, AP IT Minister Mekapati Goutham Reddy Dies, AP Minister Gautham Reddy Passed Away, AP Minister Mekapati Goutham Passes Away Due To Heart Attack, AP Minister Mekapti Goutham Reddy Passed Away, AP Minister Mekapti Goutham Reddy Passed Away with Heart Attack, Mango News, Mango News Telugu,

ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం చెందడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలో గౌతమ్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా, గౌతమ్‌ రెడ్డి మృతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లెకు తరలించనున్నారు. అయితే, ఆయన కుమారుడు అర్జున్‌ రెడ్డి అమెరికా నుంచి వస్తున్నందున ఎల్లుండి ఆయన అంత్యక్రియలను జరుపనున్నారు. అధికారిక లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మంత్రి గౌతమ్‌ రెడ్డి మరణం ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయింది. స్వతహాగా సౌమ్యుడు, మృదుభాషి అయినందున ఆయనకు రాజకీయాలలో అన్ని పార్టీల నేతలతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో పార్టీలకు అతీతంగా నేతలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా గౌతమ్‌ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులు తెలపటం విశేషం. అలాగే, తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గౌతమ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కాగా, గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకున్న వైఎస్ షర్మిల ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + six =