ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ.. రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిలు సహా పలు అంశాలపై చర్చ

AP CM YS Jagan Mohan Reddy Meets PM Modi in Delhi Today To Discuss Several State Issues,Ap Cm Jagan Meeting Prime Minister Modi,Discussion On Various Issues,Including Funds To Be Received And Dues,Mango News,Mango News Telugu,CM YS Jagan Meet PM Narendra Modi,CM YS Jagan Meet Narendra Modi,Narendra Modi Meeting With YS Jagan,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు ప్రధాని మోదీతో ఆయన భేటీ కొనసాగినట్లు సమాచారం. రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండాగా సాగిన ఈ సమావేశంలో.. విభజన కారణంగా తలెత్తిన క్లిష్ట పరిస్థితులు, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను సీఎం జగన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరినట్లు తెలుస్తోంది. విభజన సమయంలో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం చేసిన వాగ్దానాలను గుర్తు చేసి వాటి అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని సమాచారం.

అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ఆర్ధిక పరిస్థితి కారణంగా రాష్ట్రానికి ప్రత్యేకంగా రుణ పరిమితి పెంపు చేయాల్సిందిగా సీఎం జగన్, ప్రధాని మోదీని కోరినట్లు తెలుస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్ట్ యొక్క సవరించిన వ్యయాన్ని మంజూరు చేయాలని మరియు షెడ్యూల్ 9 మరియు 10 సంస్థల విభజనను సత్వరమే చేపట్టాల్సిందిగా ప్రధానమంత్రిని కోరినట్లు సమాచారం. దీంతో పాటు ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశం అనంతరం సీఎం జగన్ పలువురు హోంమంత్రి అమిత్ షా, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + six =