ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 18, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2282 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,713 సాంపిల్స్ ని పరీక్షించగా 52 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 150 (మహారాష్ట్ర 101, గుజరాత్ 26, రాజస్థాన్ 11, ఒడిశా 10, పశ్చిమ బెంగాల్ 1, కర్ణాటక 1) మందికి కరోనా నిర్ధారణ అవ్వగా 25 మంది కోలుకున్నట్టు ప్రకటించారు.
ఏపీలో కొత్తగా కృష్ణా, చిత్తూరులో జిల్లాలలో 15 చొప్పున, నెల్లూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూల్ లో 4, పశ్చిమ గోదావరి, కడపలో 2 చొప్పున, విజయనగరం, విశాఖపట్నంలో జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 52 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే చిత్తూరు జిల్లాలో నమోదైన 12, నెల్లూరులో 7 కేసులతో కలిపి మొత్తం 19 కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవిగా చెప్పారు. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 50 మంది మృతి చెందగా, మరో 1527 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక ప్రస్తుతం 705 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 17, ఆదివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1551 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 37 మందికి, రంగారెడ్డి జిల్లాలో 3, వలస వచ్చిన వారిలో ఇద్దరితో కలిపి మొత్తం 42 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, 992 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 525 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
*9,713 సాంపిల్స్ ని పరీక్షించగా 52 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*94 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/x9nOxi0Rhi— ArogyaAndhra (@ArogyaAndhra) May 18, 2020
Media bulletin
Date: May 17, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/v4NpPaUpRB
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 17, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu