ఏపీలో 7 వేలు దాటిన కరోనా కేసులు, 90 కి చేరిన మరణాలు

AP Covid-19 Updates, Positive Cases Cross 7000 in AP, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 7 వేలు దాటింది. వీటిలో 275 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 50, విదేశాల నుంచి వచ్చిన వారు 26 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 351 కేసులతో కలిపి జూన్ 17, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7071 కు చేరింది. ఈ కేసుల్లో 5555 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 1516 మంది ఉన్నారు. మరోవైపు ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 90 కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2906 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 55 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 2559 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =