ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలు

AP Employees Unions Calls For Strike From February 7 Regarding PRC Issue,AP employees threaten strike,AP Employees Unions Calls For Strike,AP Employees Unions Calls For Strike Regarding PRC Issue,Andhra Pradesh govt employees,Staff to wage a united fight against pay revision GOs ,Andhra govt employees strike over pay revision,Andhra Pradesh government ,AP Cabinet approves PRC Jeevol-Employees on strike,PRC Issue,PRC Issue in Ap,mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ ఐకాస, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశంలో.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై అవలంభిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఉద్యమ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నెల 24న (సోమవారం) ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఈరోజు ఏపీ సీఎస్‌ను కలిసి పాత విధానంలో జీతాలు ఇవ్వాలని కోరనున్నాయి. 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నాయి. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాలను సమర్పించనున్నారు. అలాగే, ఈ నెల 27 నుంచి 30 వరకూ నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =