ఏపీలో రేపే తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

2021 Andhra Pradesh Graduate MLC Elections, Andhra Pradesh, Andhra Pradesh Graduate MLC Elections, Andhra Pradesh Graduate MLC Elections 2021, Andhra Pradesh MLC Elections, Andhra Pradesh MLC Elections 2021, AP MLC Elections, AP Teachers Quota MLC Elections Polling, Mango News, MLC Elections, MLC Elections In AP, MLC Elections Polling In AP, Teacher MLC elections, Teachers Quota MLC Elections Polling In AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు స్థానాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. కాగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన చోట మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులే ఎక్కువగా బరిలో నిలిచారు. ఏపీలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలో ఉంచలేదు. కాగా తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 116 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 17,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే కృష్ణా-గుంటూరు స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 111 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 13,505 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fifteen =