దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు విధించిన మూడోవిడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏపీలో ప్రకటించిన తాజా మార్గదర్శకాలు:
- రాష్ట్రంలో కంటైన్మెంట్, బఫర్జోన్లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరచుకునేందుకు అవకాశం.
- కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతి.
- రూరల్, అర్బన్ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ తెరవడానికి అనుమతి లేదు.
- బంగారం దుకాణాలు తో పాటుగా వస్త్ర, చెప్పుల దుకాణాలు తెరవడానికి కూడా అనుమతి లేదు.
- దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా దుకాణాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
- అలాగే దుకాణాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
- లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu