కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమక్షంలోనే జేసీ అపరాజిత సింగ్ వివాహం..

AP Krishna District JC Aparajita Singh Got Registered Marriage with Trainee IPS Devendra Kumar,AP Krishna District JC Aparajita Singh,JC Aparajita Singh Got Registered Marriage,Marriage with Trainee IPS Devendra Kumar,IPS Devendra Kumar,Mango News,Mango News Telugu,JC Aparajita Singh, JC got married in the Collectorate, Aparajita Singh Sinwar, Joint Collector, Machilipatnam, Krishna District, Register Marriage,JC Aparajita Singh Latest News,JC Aparajita Singh Latest Updates,IPS Devendra Kumar Latest News,IPS Devendra Kumar Latest Updates

ఇప్పుడు ఎక్కడైనా పెళ్లి జరిగింది అంటే దానికి ఖర్చు ఎంతయింది? ఎంత మంది గెస్టులు వచ్చారు? పెళ్లి ఎక్కడ అయింది ఇవే లెక్కలు వేస్తున్నారు. కేవలం ప్రెస్టేజ్‌కు సంబంధించిన విషయంగా తీసుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకుని అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా ఏపీలోని మచిలీపట్నం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్, ట్రైనీ ఐపీఎస్ పెళ్లి అందరినీ ఆకట్టుకుంటోంది.

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్‌ సిన్వర్‌ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అపరాజిత సింగ్‌ అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్‌ దేవేంద్రకుమార్‌ను వివాహమాడారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్‌ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో అపరాజిత-దేవేంద్ర కుమార్‌ పరస్పరం దండలు మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన దేవేంద్రకుమార్‌ హైదరాబాద్‌లోని పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

కాగా, అపరాజిత-దేవేంద్ర దంపతులకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత అధికారులుగా ఉన్న వ్యక్తులు ఇలా సాధారణంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, గతంలో కూడా పలువురు ఉన్నత అధికారులు ఇదే విధంగా ఆదర్శ వివాహం చేసుకున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఏపీ కేడర్‌కు చెందిన మరో యువ ఐఏఎస్‌ల జంట వివాహం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్.. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి వివాహం తిరుపతిలో జరిగింది. వారి బంధు మిత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నాగలక్ష్మి 2012 బ్యాచ్ ఐఏఎస్ కాగా, నవీన్ కుమార్ 2019 ఐఏఎస్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన జేసీగా పనిచేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =