కోవిడ్ వ్యాక్సినేషన్‌ లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం వైఎస్ జగన్‌

Andhra Pradesh, Andhra Pradesh Department of Health, AP CM YS Jagan, AP CM YS Jagan Held Review on Covid-19 Control Measures, AP CM YS Jagan Review on Covid-19 Control Measures, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, Covid-19 Control Measures, Covid-19 Control Measures In AP, Mango News, Total Corona Cases In AP, YS Jagan Review Meeting, YS Jagan Review Meeting Over Covid-19 Control Measures

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సంట్రేటర్లు, డీ-టైప్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ముందుగానే అవసరమైన శిక్షణ ఇచ్చి జిల్లాల వారీగా కాన్సంట్రేటర్లు/ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.

మరోవైపు ముందుగా 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ప్లాంట్ల ఏర్పాటుపై వారికి ప్రభుత్వం తరపున 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇక వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్‌ తర్వాత అక్కడి కోవిడ్‌ పరిస్థితులు సహా ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించాలని ఈ అంశాలపై అధ్యయనం అనంతరం కమిటీ నివేదిక సమర్పించాలని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌ సూచించారు. వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్నారు. అలాగే రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాలల కోసం పెండింగ్‌ ఉన్న చోట భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని, పనులపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్టబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ తో పాటుగా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =